సాహో ఆదర్శంగా ‘సైరా’

భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న మెగాస్టార్‌ చిరంజీవి 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ ని అక్టోబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న విషయం తెల్సిందే. భారీ బడ్జెట్‌తో ఈ చిత్రంను తెరకెక్కించిన కారణంగా సినిమాను కేవలం తెలుగులో మాత్రమే కాకుండా హిందీ తమిళం మరియు ఇంకా ఇతర భాషల్లో కూడా విడుదల చేయాలని భావిస్తున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి తెలుగు తెలుగులో భారీ వసూళ్లను అయితే రాబట్టగలడు. కాని ఉత్తరాదిన అంతగా వసూళ్లను సాధించడం కష్టమే.

బాలీవుడ్‌ ప్రేక్షకుల దృష్టిని సైరా టీం ఆకర్షించాలంటే చాలా కష్టపడాల్సి ఉంది. అందుకోసం అక్కడ భారీగా ఈవెంట్స్‌ చేయాలని, విభిన్నంగా ప్రమోషన్స్‌ చేయాలని భావిస్తున్నారు. సైరా ప్రమోషన్స్‌ బాధ్యతలను ఉపాసన తీసుకున్నట్లుగా సమాచారం అందుతోంది. సాహో చిత్రంకు ఎలాగైతే ఉత్తరాదిన మంచి క్రేజ్‌ను తీసుకు వచ్చారో అలాగే సైరాకు కూడా అలాగే అక్కడ ప్రమోషన్స్‌ మరియు వీడియోలతో ప్రమోట్‌ చేయాలని భావిస్తున్నారు. అమితాబచ్చన్‌ తో పాటు పలువురు బాలీవుడ్‌ స్టార్స్‌ సైరా కోసం పని చేశారు. వారిని ముందుంచి ప్రమోట్‌ చేసే అవకాశం కనిపిస్తుంది. సాహో కూడా అలాగే ప్రమోట్‌ చేస్తున్న విషయం తెల్సిందే.