ఇండియన్‌ 2 రిలీజ్ ఎప్పుడో తెలుసా..?

శంకర్ డైరెక్షన్లో కమల్ హాసన్ హీరోగా ‘ఇండియన్‌ 2 (భారతీయుడు 2) ‘ సెట్స్ పైకి వచ్చిన సంగతి తెలిసిందే. రెండు నెలల క్రితం గ్రాండ్ గా అతిరధుల సమక్షంలో గ్రాండ్ లాంచ్ అయ్యింది. కానీ ఆ తర్వాత సినిమా కు ఓవర్ బడ్జెట్ కారణంగా ఆపేసారు. తాజాగా బడ్జెట్ అన్ని ఓ కొలిక్కి వచ్చినట్లు మళ్లీ సినిమాను సెట్స్ పైకి తీసుకోబోతున్నట్లు సమాచారం. అయితే సినిమా మాత్రం ఇప్పట్లో రిలీజ్ కాదని చెపుతున్నారు.

అత్యంత భారీ చిత్రం కావటంతో షూటింగ్‌కే ఎక్కువ రోజులు సమయం పడుతుందని భావిస్తున్నారు. అందుకే ఈ సినిమా రిలీజ్‌కు ఏడాదిన్నరకు పైగా సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. హడావిడి చేయకుండా పక్కాగా ఓకే అనుకున్న తరువాత 2021 మార్చిలో సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఈ చిత్రంలో బొమ్మరిల్లు ఫేమ్ సిద్దార్థ్ ఒక కీలక పాత్రలో నటించనున్న సంగతి తెలిసిందే. ఈయనకు జోడీగా ర‌కుల్ ప్రీత్ సింగ్‌ను ఎంపిక చేశారు. తమిళ పరిశ్రమపై ఎక్కువగా దృష్టిపెట్టిన ర‌కుల్ ప్రీత్ సింగ్‌ కు ఈ సినిమా లో ఛాన్స్ రావడం అదృష్టమే అని చెప్పాలి. రకుల్, సిద్దార్థ్ కలిసి నటించడం ఇదే మొదటిసారి కాబట్టి వీరిద్దరి జోడీ కొత్తగా ఉండి, అలరిస్తుందని కోలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి.