రాహుల్ కు పెద్ద బ్యానర్ అవకాశమే వచ్చిందిగా..

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీ కి పరిచమైన రాహుల్ ర‌వీంద్ర‌న్..ఆ తర్వాత హీరోగా ప్రేక్షకుల మన్నలను పొందిన ఈయన..‘చి.ల.సౌ’ సినిమాతో డైరెక్టర్ అవతరమెత్తి హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం కింగ్ నాగార్జున తో మన్మధుడు 2 చిత్రంతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. రేపు ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా బరి ఎత్తున విడుదల కాబోతుంది. ఈ సినిమా ఫలితం రాకముందే మరో ఛాన్స్ కొట్టినట్లు తెలుస్తుంది.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ లో భాగమైన ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ సితార ఎంటర్టైన్మెంట్స్‌ లో రాహుల్ ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రం యొక్క పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మన్మధుడు 2 విషయానికి వస్తే ఓ అందమైన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కించారని..ప్రేక్షకులను ఖచ్చితంగా అలరిస్తుందని గట్టిగా నమ్ముతున్నారు. మ‌నం ఎంట‌ర్ ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై నాగార్జున అక్కినేని, పి.కిర‌ణ్‌(జెమిని కిర‌ణ్‌) ఈ చిత్రాన్ని నిర్మించారు.