నిర్మాత బెల్లంకొండ సురేష్ సినిమాల నిర్మాణంకు దూరంగా ఉంటున్నాడు. కొన్ని ఆర్ధికపరమైన కారణాల వల్ల బెల్లంకొండ సురేష్ సినిమాలకు దూరంగా ఉన్నా ఆయన కొడుకులను మాత్రం సినిమాల్లో హీరోలుగా చూడాలని తెగ ముచ్చట పడుతున్నాడు. ఇప్పటికే పెద్దబ్బాయి శ్రీనివాస్‌ను హీరోగా పరిచయం చేశాడు. స్టార్ హీరోగా అతడిని ఫోకస్ చేసేందుకు చాలా ప్రయత్నాలు చేశాడు, ఇంకా చేస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం టాలీవుడ్‌లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మంచి నటుడిగా గుర్తింపు దక్కించుకుని దూసుకు పోతున్నాడు. కమర్షియల్ సక్సెస్‌లు లేకున్నా కూడా ఢీలా పడిపోకుండా సినిమా వెంట సినిమాలు చేస్తూనే ఉన్నాడు.
ఇక బెల్లంకొండ ఇంటి నుండి మరో హీరో రాబోతున్నాడు. సురేష్ చిన్న కొడుకు గణేష్ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అవుతున్నాడు. గత కొంత కాలంగా ట్రైనింగ్‌లో ఉన్న గణేష్ ఇప్పుడు సినిమా చేయబోతున్నాడు. మొదటి సినిమా విషయంలో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. భారీ ఎత్తున అంచనాలున్న గణేష్ మూవీ ఈ ఏడాదిలోనే ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి అన్న తరహాలో ఇతడు గుర్తింపు దక్కించుకుంటాడా లేదంటే అంతకు మించి స్టార్ దక్కించుకుంటాడో చూడాలి.