‘రణరంగం’ సెన్సార్‌ రిపోర్ట్‌

శర్వానంద్‌ హీరోగా కాజల్‌, కళ్యాణి ప్రియదర్శన్‌ హీరోయిన్స్‌గా తెరకెక్కిన ‘రణరంగం’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. ఆగస్టు 15వ తారీకున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో శర్వానంద్‌ రెండు విభిన్నమైన పాత్రలను పోషిస్తున్న విషయం తెల్సిందే. ఈ చిత్రంకు సుధీర్‌ వర్మ దర్శకత్వం వహించాడు. శర్వానంద్‌ లుక్‌ మరియు ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా సినిమా బాగుంటుందనే టాక్‌ వస్తుంది.

సెన్సార్‌ బోర్డు ఈ చిత్రంకు ‘యూ/ఎ’ సర్టిఫికెట్‌ను ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో సెన్సార్‌ బోర్డు చిత్రంపై పాజిటివ్‌గా రియాక్ట్‌ అయ్యిందట. శర్వానంద్‌ నటన మరియు అతడి బాడీ లాంగ్వేజ్‌ సినిమాకు ప్లస్‌ అంటూ చెప్పుకొచ్చాడు. ఒక విభిన్నమైన కథ అంటూ కూడా సినిమా యూనిట్‌ సభ్యులను సెన్సార్‌ బోర్డు సభ్యులు అభినందించినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి సెన్సార్‌ బోర్డు పాజిటివ్‌ రెస్పాన్స్‌ కారణంగా రణరంగం చిత్రం యూనిట్‌ సభ్యులు ఆనందంగా ఉన్నారు.