ఒకప్పుడు తెలుగు మరియు తమిళ సినిమా పరిశ్రమలను తన సినిమాలతో అలరించిన విజయశాంతి కొంత కాలం లేడీ ఓరియంటెడ్ చిత్రాలను చేసింది. ఆ తర్వాత బీజేపీలో చేరి రాజకీయాలు చేయడం మొదలు పెట్టింది. బీజేపీలో జాయిన్ అవ్వడంతోనే ఆమెకు జాతీయ స్థాయిలో మంచి హోదాను బీజేపీ ఇచ్చింది. బీజేపీలో పలు కీలక పదవులు చేపట్టిన విజయశాంతి ఆ తర్వాత పలు పార్టీలు మారుతూ వచ్చింది. సొంతంగా పార్టీ కూడా పెట్టింది. తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించిన విజయశాంతి ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉంది.
గత ఆరు సంవత్సరాలుగా కాంగ్రెస్‌లో ఉన్న విజయశాంతి త్వరలో బీజేపీలోకి వెళ్లే యోచనలో ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. ఈమెకు బీజేపీ నుండి పిలుపు వస్తోంది. తెలంగాణలో బీజేపీని బలపర్చేందుకు ఏ ఒక్క అవకాశంను ఆ పార్టీ నాయకులు వదులుకోవడం లేదు. అందులో భాగంగానే రాములమ్మను మళ్లీ బీజేపీలోకి రావాల్సిందిగా కోరుతున్నారు. రాములమ్మ కూడా బీజేపీని తనకు రాజకీయ జీవితం ఇచ్చిన మాతృపార్టీగా భావించి రావాలనే ఉద్దేశ్యంతోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. మహేష్‌బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రంకు విజయశాంతి కమిట్ అయిన విషయం తెల్సిందే. ఆ సినిమా పూర్తి అయిన తర్వాత బీజేపీ నాయకులతో ఆమె భేటీ అయ్యే అవకాశం ఉంది. రాములమ్మ బీజేపీలోకి వెళ్తే తెలంగాణలో ఆ పార్టీకి ప్లస్ అవ్వడం ఖాయం.