కొబ్బరి మట్ట కోసం కలెక్షన్ కింగ్..

హృదయ కాలేయం తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంపూర్ణేష్ బాబు ..తాజాగా కొబ్బరి మట్ట చిత్రం తో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. సినిమా ఎలాగున్నా సరే దాని ప్రమోషన్ విషయంలో మాత్రం సంపూ శభాష్ అనిపించుకుంటాడు. జనాల్లో ఆసక్తి కలిగేలా చాల వినూత్నంగా సినిమా ప్రచారం చేసి ఓపెనింగ్స్ రాబడతాడు. రీసెంట్ గా వరల్డ్ రికార్డ్ ట్రైలర్ పేరుతో రిలీజ్ చేసిన వీడియోలో మూడున్నర నిమిషాల డైలాగ్ చెప్పి ఆశ్చర్య పరిచాడు. ఈ టీజర్ యూట్యూబ్ లో సంచనలనం రేపి సినిమా ఫై ఆసక్తి పెంచింది.

ఇదే అనుకుంటే ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకకు ఏకంగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నే పిలిచి ఇంకాస్త క్రేజ్ తెచ్చాడు. ఈనెల 10న ఈ మూవీ విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ఈరోజు సాయంత్రం గ్రాండ్ గా ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మోహన్ బాబు హాజరుకానున్నారు.

ఈ విషయాన్ని ధృవీకరిస్తూ హీరో సంపూర్ణేష్ బాబు ట్వీట్ చేయడం జరిగింది. “నాలాంటి ఒక చిన్న నటుడు అడిగిన వెంటనే మా ప్రిరిలీజ్ ఫంక్షన్ కి ఆశీర్వదించటానికి విచ్చేస్తున్న మా రియల్ పెదరాయుడు మోహన్ బాబు గారికి నా పాదాభివందనం” అని మోహన్ బాబుకి సంపూ కృతజ్ఞత తెలుపుతూ ట్వీట్ చేశారు.

స్టీవ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సాయి రాజేష్ నీలం నిర్మిస్తున్నారు. నటి షకీలా, ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ ఇతర ముఖ్యపాత్రాలలో కనిపించనున్నారు.