పీఓకేను ఎలా స్వాదీనం చేసుకోవాలో తెలుసు : అమిత్‌షా

ఇండియా నుండి జమ్ము కాశ్మీర్‌ను వేరు చేసే ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం భవిష్యత్తులో మరిన్ని సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాల వారు భావిస్తున్నారు. అనుకున్నట్లుగానే తాజాగా అమిత్‌ షా పార్లమెంటులో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ ఖచ్చితంగా జమ్మూ కాశ్మీర్‌లో భాగమే అని, దాన్ని ఎలా స్వాదీనం చేసుకోవాలో మాకు తెలుసు అని, త్వరలోనే పీఓకే ఇండియాలో భాగం అవుతుందని అమిత్‌ షా అన్నాడు.

పీఓకేలోని 25 పార్లమెంటు స్థానాలకు కూడా ఎన్నికలు నిర్వహించబోతున్నట్లుగా అమిత్‌ షా ప్రకటించాడు. 1948లో ఇండియన్‌ ఆర్మీ పాక్‌ ఆర్మీని తరుముకుంటూ బాలాకోట్‌ వరకు వెళ్లాయి. ఆ సమయంలో అలాగే ఉంటే పీఓకే ఇప్పుడు ఇండియాలోనే భాగస్వామ్యంగా ఉండేది. ఆ నాడు నెహ్రూ ఇండియన్‌ ఆర్మీని వెనక్కు పిలిపించిన కారణంగా పీఓకే మనకు దూరం అయ్యిందని అమిత్‌ షా అన్నారు. పీఓకేను ఇండియా స్వాదీనం చేసుకుని తీరుతుందని అమిత్‌ షా అన్నారు. మోడీ మరియు అమిత్‌ షా తల్చుకుంటే ఏదైనా సాధ్యమే అంటూ దేశం నమ్ముతుంది. అందుకే పీఓకేను స్వాదీనం చేసుకుంటారనే నమ్మకం కలుగుతోంది.