హిందీ ఆర్ ఎక్స్ 100 లో హీరో ఎవరో తెలుసా..?

తెలుగులో సూపర్ హిట్ అయినా చిత్రాలు బాలీవుడ్ లో రీమేక్ అయి బ్లాక్ బస్టర్ హిట్స్ అవుతూ నిర్మాతలకు కాసుల పంట కురిపిస్తున్నాయి. దీంతో అక్కడి దర్శక , నిర్మాతలంతా మన సినిమాల ఫై ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. తెలుగు లో కార్తికేయ , పాయల్ జంటగా అజయ్ భూపతి డైరెక్షన్లో తెరకెక్కిన ఆర్ ఎక్స్ 100 చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు.

ఈ రీమేక్ లో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కుమారుడు అహన్ శెట్టి హీరోగా పరిచయం అవుతున్నారు. మిలన్ లుథ్రియా దర్శకత్వం వహిస్తుండగా అహన్ శెట్టి సరసన హీరోయిన్ గా తారా సుతారియా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ బాలీవుడ్ నిర్మాత సాజిద్ నడియావాలా నిర్మిస్తున్నారు. మరి తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అయినా ఈ మూవీ హిందీ లో ఎలాంటి హిట్ నమోదు చేస్తుందనేది చూడాలి.