అనసూయ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘కథనం’ చిత్రం ఆగస్టు 9వ తారీకున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. అనసూయ ఈ చిత్రంలో లేడీ స్టార్‌గా కనిపించబోతుంది. యాక్షన్ సీన్స్ చేయడంతో పాటు, ఆకట్టుకునే పాత్రలో ఈ అమ్మడు నటించిందని ట్రైలర్ చూస్తుంటేన అనిపిస్తుంది. దాంతో ఈ చిత్రం తప్పకుండా సక్సెస్ అవుతుందని అంతా నమ్ముతున్నారు. ఇక కథనం చిత్రం మన్మధుడితో పోటీని తట్టుకుంటుందా అంటూ మొదటి నుండి చర్చ జరుగుతోంది. ఇప్పుడు కొబ్బరి మట్ట కూడా వచ్చి చేరింది. కనుక కథనం చిత్రంకు కష్టమే అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మన్మధుడు మరియు కొబ్బరిమట్టతో పోటీ వద్దనుకుని ఈ చిత్రం విడుదల వాయిదా వేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. వరుస సెలవులు కారణంగా సినిమాను ఇప్పుడే విడుదల చేస్తే బాగుంటుందని అంతా భావిస్తున్నారు. కాని సినిమాకు ఏమైనా తేడా టాక్ వస్తే మాత్రం మొదటికే మోసం వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. అందుకే సినిమాను విడుదల చేయడంలో ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. కథనం సినిమా ప్రమోషన్స్ ఎక్కువగా చేయడం లేదు. దాంతో ఈ చిత్రం విడుదల వాయిదా వేశారు అంటూ ప్రచారం జరుగుతోంది. అసలు విషయం ఏంటి అనేది ఒకటి రెండు రోజుల్లో తేలిపోయే అవకాశం ఉంది.