జయం రవి హీరోగా తెరకెక్కిన ‘కోమలి’ చిత్రం ట్రైలర్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ ట్రైలర్ చాలా ఎంటర్టైనర్గా ఉంది. 16 ఏళ్ల క్రితం కోమాలోకి వెళ్లిన వ్యక్తి ఇప్పుడు కోమా నుండి బయటకు వస్తే అతడు ఎలాంటి పరిస్థితులను చూస్తాడు. అతడు ప్రస్తుతం పెరిగిన టెక్నాలజీని మరియు రేట్లను చూసి ఎలా ఆశ్చర్య పోతాడు అనేది సినిమా కథాంశంగా ఉంది. ట్రైలర్ చాలా సరదాగా సాగింది. సినిమాపై అంచనాలు పెంచేదిగా ఉంది. అయితే ట్రైలర్ చివర్లో రజినీకాంత్‌ను అవహేలన చేసే విధంగా ఒక షాట్ పెట్టారు.
హీరో కోమాలోకి వెళ్లక ముందు నుండి రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తానంటూ చెబుతున్నాడు. 16 ఏళ్ల తర్వాత కోమా నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తాను అంటూనే చెబుతున్నాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు రజినీకాంత్ అదే పాట పాడుతున్నాడు కాని రాజకీయాల్లోకి వచ్చింది లేదు అనేది ఆ సీన్ ఉద్దేశ్యం. దాంతో రజినీకాంత్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ద్వారా కోమలి చిత్రంను టార్గెట్ చేయడంతో ఆగస్టు 15న విడుదల కాబోతున్న చిత్రంకు ఇబ్బంది లేకుండా రజినీకాంత్‌కు మరియు ఫ్యాన్స్‌కు కోమలి చిత్ర యూనిట్ సభ్యులు సారీ చెప్పారు.