శర్వానంద్‌ను సైతం ఇబ్బంది పెట్టిన ఫ్యాన్‌

మూడు వారాల క్రితం డియర్‌ కామ్రేడ్‌ చిత్రం ప్రమోషన్‌ కార్యక్రమంలో భాగంగా విజయ్‌ దేవరకొండ ఏదో విషయాన్ని సీరియస్‌గా మాట్లాడుతున్న సమయంలో హఠాత్తుగా ఒక అభిమాని వచ్చి కాళ్లపై పడ్డాడు. అతడు చాలా ఫోర్స్‌గా రావడంతో విజయ్‌ దేవరకొండ కింద పడబోయాడు. కొద్దిలో ప్రమాదం తప్పినట్లయ్యింది. దాంతో విజయ్‌ దేవరకొండ షాక్‌ అయ్యాడు. అక్కడ ఉన్న వారు వెంటనే అతడిని తీసుకు వెళ్లి పోయారు. తాజాగా అదే సంఘటన శర్వాకు కూడా ఎదురైంది.

రణరంగం చిత్రం ట్రైలర్‌ రిలీజ్‌ కార్యక్రమంలో మాట్లాడుతున్న సమయంలో శర్వానంద్‌పై ఒక్కసారిగా అభిమాని వచ్చి పడ్డాడు. దాంతో శర్వానంద్‌ షాక్‌ అయ్యాడు. షాక్‌ నుండి తేరుకుని హీరోల కాళ్లపై పడవద్దు. మీ తల్లిదండ్రుల కాళ్లపై పడండి అంటూ అసహనం వ్యక్తం చేశాడు. ఇది మరీ నీచంగా ఉందంటూ కోపం తెచ్చుకున్నాడు. ఇలాంటి సంఘటనలు మళ్లీ మళ్లీ జరుగుతుండటం బాధాకరం అన్నాడు. ఇలాంటివి మళ్లీ జరగవద్దని కోరుకుంటున్నట్లుగా శర్వా అన్నాడు. శర్వానంద్‌ ఆ అభిమాని పట్ల వ్యక్తం చేసిన కోపం సోషల్‌ మీడియాలో చర్చనీయాంశం అవుతోంది.