జగపతి ఆ వ్యవసనము నుండి బయటకు రావట్లేదా..?


లెజెండ్ చిత్రంతో విలన్ గా మారిన జగపతి బాబు..ఆ తర్వాత వరుస పెట్టి విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ వరుస సినిమాలు చేస్తున్నాడు. కేవలం తెలుగులోనే కాదు ఇతర భాషల్లోనూ నటిస్తూ బిజీ అయ్యాడు. గత కొంతకాలం గా ఏ మాత్రం రెస్ట్ లేకుండా వరుస సినిమాలు చేసిన జగ్గూభాయ్..ప్రస్తుతం గోవా లో ఉన్నాడు.

గోవాలో బిగ్ డాడీ కాసినోలో మిలియన్ డాలర్లును కొల్లగొట్టేందుకు సిద్ధమైపోయారు. ఇదే విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తన ఫొటోని ట్విట్టర్లో పోస్ట్ చేసి `నేను గోవా బిగ్ డాడీ కాసినోలో ఎంజాయ్ చేస్తున్నాను. నన్ను విష్ చేయండి` అని పోస్ట్ చేసి ఆసక్తి పెంచాడు. సమయం దొరికినప్పుడల్లా జగ్గూభాయ్ గోవా చెక్కేసి కాసినోలో పందాలు కాసేస్తుంటాడు. డబ్బులు వస్తుంటాయి పోతుంటాయి కానీ జగ్గూభాయ్ మాత్రం గోవా కాసినోకి వెళ్లడం మాత్రం మానడు. గతంలో జగపతిబాబు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకోవడానికి ఆ వ్యవసనమే కారణమని ఇప్పటికీ టాలీవుడ్లో కథలు కథలుగా చెప్పుకుంటుంటారు. కానీ జగపతి మాత్రం అలాంటిదేం లేదని కొట్టిపారిస్తుంటాడు.