సీఎంగా ఉన్న సమయంలో తీరిక లేకుండా గడిపిన చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడిగా మారిన నేపథ్యంలో కుటుంబంతో ఎక్కువగా గడిపేందుకు ఆసక్తి చూపుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం పార్టీ పరిస్థితి కూడా సరిగా లేని కారణంగా ఎక్కువ టెన్షన్ తీసుకోకుండా కుటుంబంతో గడపాలని బాబు భావిస్తున్నాడు. అందుకే సీఎం పదవి పోయినప్పటి నుండి ఇప్పటి వరకు అప్పుడే రెండు సార్లు చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనలో సేద తీరుతున్నాడు.
తాజాగా ఆరోగ్య పరమైన కారణాలు చెబుతూ అమెరికా వెళ్లిన చంద్రబాబు నాయుడు అక్కడ సరదాగా కాలం గడుపుతున్నాడు. తాజాగా భార్యతో కలిసి ఒక కాఫీ షాప్‌కు వెళ్లాడు. అక్కడ ఇద్దరు కలిసి కాఫీ ఆర్డర్ ఇవ్వడంతో పాటు చాలా సింపుల్‌గా అక్కడ వారితో కలిసి పోయారు. అమెరికాలో వారం నుండి పది రోజుల పాటు ఉంటారని తెలుస్తోంది. అక్కడ హెల్త్ చెకప్ చేయించుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు వయసు మీద పడుతున్న నేపథ్యంలో వెంటనే అలసి పోతున్నాడు. అందుకే హెల్త్ చెకప్‌కు వెళ్లినట్లుగా పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.