ఆ ప్రచారం నాకు అవకాశాలు రాకుండా చేస్తోంది

పోసాని కృష్ణ మురళి అనారోగ్యంతో ఉన్నారు. ఆయనకు చేసిన ఆపరేషన్‌ వికటించడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది అంటూ మీడియాలో రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. ఆయనకు రెండవ సారి ఆపరేషన్‌ చేసిన తర్వాత కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా మీడియా ముందుకు వచ్చిన పోసాని మీడియాలో వస్తున్న వార్తలపై తనదైన శైలిలో స్పందించాడు. తాను చాలా గట్టిగా ఉన్నాను, ఇప్పట్లో చచ్చే ప్రసక్తే లేదు. ఇంకా నేను చేయాల్సినవి చాలానే ఉన్నాయి అంటూ తనదైన స్లాంగ్‌తో మీడియా ముందు చెప్పుకొచ్చాడు.

నేను అనారోగ్యంతో ఉన్నాను అంటూ వస్తున్న ప్రచారం కారణంగా నాకు చాలా ఆఫర్లు తగ్గి పోయాయి. ప్రస్తుతం నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నా కూడా నన్ను ఎవరు సంప్రదించడం లేదు. నాకు మొదటి ఆపరేషన్‌ చేసిన తర్వాత ఇన్ఫెక్షన్‌ వచ్చింది. దాంతో డాక్టర్‌ మళ్లీ ఆపరేషన్‌ చేసి బతికించారు. ఇప్పుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను. నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అంటూ చెప్పుకొచ్చాడు. మళ్లీ సినిమాల్లో నటించేందుకు సిద్దంగా ఉన్నాను. ఎవరైనా ఆఫర్‌ ఇస్తే తప్పకుండా తన పాత్రకు పూర్తి న్యాయం చేసేలా నటిస్తానంటూ చెప్పుకొచ్చాడు.