సాహో కు భారీ బందోబస్త్..

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్రం ఆగస్టు 15 న ప్రేక్షకుల ముందుకు వస్తుందని ఎంతో సంబరాలు చేసుకున్నారు. కానీ ఈ చిత్రాన్ని ఆగస్టు 30 కి వాయిదా వేయడం తో అభిమానులతో పాటు చిత్ర వర్గాలు కూడా కాస్త నిరాశ వ్యక్తం చేసారు. ముఖ్యంగా ఆగస్టు 30 కి విడుదల కావాల్సిన సినిమాలు మరో డేట్ కు వాయిదా వేశారు. కానీ సూర్య మాత్రం సాహో తో సై అంటున్నారు.

హీరో సూర్య‌, మ‌ల‌యాళ స్టార్ మోహ‌న్ లాల్‌, ఆర్య ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రంగం ఫేమ్ కేవీ ఆనంద్ డైరెక్షన్లో తెరకెక్కిన తమిళ చిత్రం ‘కప్పన్’ తెలుగులో బందోబస్త్ పేరిట రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాను ముందు నుండి ఆగస్టు 30 న తెలుగు , తమిళ్ భాషల్లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ సాహో వాయిదా పడడంతో ఈ సినిమాను కూడా వాయిదా వేస్తారు కావొచ్చనే వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ ఈ సినిమాను వాయిదా వేసే ప్రసక్తి లేదని ఆగస్టు 30 నే వస్తుందని చిత్ర యూనిట్ మరోసారి క్లారిటీ ఇచ్చారు.

మరి గత కొంతకాలం గా హిట్ లేని సూర్య ఈ సినిమా ఫై భారీ ఆశలే పెట్టుకున్నారు. మరి ఆయన ఆశలు ఏ మేరకు నెరవేరుతాయో..సాహో కు తట్టుకొని ఏ మేరకు నిలబడతాడో చూడాలి.