విజయ్ దేవరకొండ తాజా చిత్రం ‘డియర్ కామ్రేడ్’ భారీ అంచనాల నడుమ ఇటీవలే విడుదలైన విషయం తెల్సిందే. అంచనాలను అందుకోవడంలో ఈ చిత్రం విఫలం అయ్యింది. సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేక పోయిందని, సినిమాపై ఓవర్ కాన్ఫిడెన్స్‌తో చిత్ర యూనిట్ సభ్యులు మూడు గంటల వరకు నిడివి ఉంచారు. ఆ నిడివే సినిమా ఫ్లాప్‌కు కారణం అంటూ ట్రోల్స్ వచ్చాయి. దాంతో వెంటనే సినిమా నుండి దాదాపు 20 నిమిషాల పాటు కట్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. అయినా అప్పటికే నష్టం జరిగిపోయింది.
సినిమా కలెక్షన్స్ మరీ దారుణంగా నమోదు అవుతున్నాయి. ఇలాంటి సమయంలో చిత్ర యూనిట్ సభ్యులు కట్ చేసిన క్యాంటీన్ పాటను ఇప్పుడు యాడ్ చేయబోతున్నారు. ఫస్ట్ హాఫ్‌లో వచ్చే ఆ పాట సినిమాకు మళ్లీ ప్రేక్షకులను రప్పిస్తుందనే నమ్మకంను చిత్ర యూనిట్ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. కాని ఇప్పటికే జరిగిపోయిన నష్టంను భర్తీ చేసేందుకు వారు ప్రయత్నాలు చేయడం విడ్డూరంగా ఉందని నెటిజన్స్ చెవులు కొరుక్కుంటున్నారు. కామ్రేడ్‌ను బతికించేందుకు వారు చేస్తున్న ప్రయత్నం ఎంత వరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.