విజయ్ దేవరకొండ నటించిన ‘అర్జున్ రెడ్డి’ చిత్రం తెలుగులో సెన్షేషనల్ సక్సెస్ అయ్యింది. దాంతో దాన్ని హిందీలో రీమేక్ చేశారు. అక్కడ ఏకంగా 300 కోట్ల వసూళ్లను సాధించింది. ఇప్పుడు విజయ్ దేవరకొండ నటించి తాజాగా విడుదలైన ‘డియర్ కామ్రేడ్’ చిత్రంను కూడా హిందీలో రీమేక్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సినిమా విడుదలకు ముందే కరణ్ జోహార్ రీమేక్ రైట్స్‌ను దాదాపు ఆరున్నర కోట్లకు కొనుగోలు చేసినట్లుగా వార్తలు వచ్చాయి.
తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘డియర్ కామ్రేడ్’ చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. సెకండ్ హాఫ్‌లో పరమ బోరింగ్ సీన్స్ ఉన్నాయి అంటూ విమర్శలు వ్యక్తం అయ్యాయి. దాంతో సినిమాను హిందీలో రీమేక్ చేస్తారా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కథ కూడా పెద్ద ఇంట్రెస్టింగ్గా లేదు. ఎలా కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని రీమేక్ చేసేందుకు ముందుకు వచ్చాడో అంటూ తెలుగు ప్రేక్షకులు ముక్కున వేలేసుకుంటున్నారు. కరణ్ జోహార్ ఈ రీమేక్ విషయంలో పునరాలోచించే అవకాశం ఉందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.