దిల్ రాజు ఫై నమ్మకం లేదా ..?

టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ నిర్మాత అంటే ఎవరైనా దిల్ రాజు పేరే చెపుతారు. కథ దగ్గరి నుండి మొదలు పెడితే సినిమా రిలీజ్ అయి దాని ప్రచారం వరకు రాజు అన్నింట్లోనూ దిట్ట. అందుకే ఆయనతో సినిమా అంటే మన హీరోలు ఏమాత్రం ఆలోచించకుండా ఒకే చెపుతారు. అలాంటిది క్రేజీ హీరో విజయ్ దేవరకొండ మాత్రం ఎందుకో రాజు గారిని పట్టించుకోవడమే లేదనే వార్త ఫిలిం సర్కిల్లో చక్కర్లు కొడుతుంది.

గత కొన్ని వారాలుగా దిల్ రాజు ఓ సినిమా చేద్దామని విజయ్ కు ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ దానికి విజయ్ ఎస్ అనీ చెప్పకుండా, నో అనీ చెప్పకుండా వున్నట్లు తెలుస్తోంది. చూద్దాం.. చేద్దాం అనే తప్ప, ఓకె అనడంలేదు అని రాజు తన సన్నిహితుల దగ్గర చెప్పినట్లు వినికిడి. మరి కావాలనే విజయ్ రాజు ను పక్కకు పెడుతున్నాడా..లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది.