పూరి కి ఆ అలవాటు చిన్నప్పటి నుండే ఉందట..

చాల ఏళ్ల తర్వాత డాషింగ్ డైరెక్టర్ పూరి కమర్షియల్ హిట్ కొట్టి మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. ఈ సక్సెస్ ను ఆయన మాత్రమే కాదు ఆయన అభిమానులు , చిత్రసీమ ప్రముఖులు సైతం ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇస్మార్ట్ శంకర్ విజయాన్ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్న పూరి..చిత్ర ప్రమోషన్లలో తన పర్సనల్ విషయాలను షేర్ చేసుకున్నాడు.

సిగరెట్ ఎప్పుడు అలవాటు అయ్యిందనే ప్రశ్న కు దిమ్మతిరిగే సమాధానం చెప్పడం పూరి. అందరూ సినిమా ఇండస్ట్రీ కి వచ్చాక సిగరెట్ అలవాటు అయ్యిందని అనుకుంటున్నారు కానీ తను చిన్నప్పట్నుంచే చుట్టలు కాల్చేవాడిననే చెప్పుకొచ్చాడు. తన ఇంట్లో ఎవరికీ సిగరెట్ అలవాటు లేదని, తనకు మాత్రం ఆ అలవాటు వచ్చిందని, ఇక దాన్ని మానుకోలేనని కూడా అంటున్నాడు.

“నేను బాగా ఇబ్బందిపడే అంశం సిగరెట్. ఎందుకు అలవాటైందో తెలీదు. వెధవ పుట్టుక పుట్టిన తర్వాత తప్పదు కదా. నా తమ్ముడు నాతోనే పెరిగాడు వాడు కాల్చడు. నా కొడుకు కాల్చడు. నా ఒక్కడికే అలవాటైంది. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నాకు సిగరెట్ అలవాటు అవ్వలేదు. ముందునుంచే ఉంది. మా తాతమ్మ, నేను కలిసి చుట్ట తాగేవాళ్లం. ఆమెకు ఓ వందేళ్లు ఉంటాయి.” అంటూ తెలిపాడు.

ప్రస్తుతం తన దగ్గర మరో పదేళ్లకు సరిపడ కథలు ఉన్నాయని.. వాటితో సినిమాలు తీస్తే అవి హిట్ అవుతాయా, ఫ్లాప్ అవుతాయా అనే విషయం తనకు తెలియదని.. కానీ ఆ కథలన్నింటినీ సినిమాలుగా తీయొచ్చని, అలా పదేళ్లు గడిపేయొచ్చని తెలిపాడు.