తెలుగు మరియు తమిళ సినీ పరిశ్రమల్లో నయనతారకు ఉన్న క్రేజ్ ఏ పాటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈమె తమిళనాట లేడీ సూపర్ స్టార్ అంటూ గుర్తింపు పొందింది. లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఈ అమ్మడు కమర్షియల్ చిత్రాల్లో స్టార్ హీరోలతో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక స్టార్‌డంను దక్కించుకుంది. రెండు మూడు కోట్ల పారితోషికంతో సౌత్‌లోనే టాప్ హీరోయిన్‌గా దూసుకు పోతున్న ఈ అమ్మడికి తాజాగా ఏకంగా 10 కోట్ల ఆఫర్ వచ్చిందట. అయితే ఆ ఆఫర్‌ను నిర్మొహమాటంగా కాదంది.
తమిళనాట శరవణన్ అనే కొత్త నటుడు హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఆయనకు జోడీగా నయనతార అయితే మొదటి సినిమాతోనే మంచి క్రేజ్‌ను తెచ్చుకుంటాడని అంతా భావించారు. అయితే శరవణన్‌తో నటించేందుకు నయనతార నో చెప్పింది. 10 కోట్ల పారితోషికం ఆఫర్ చేసినా కూడా నిర్మాతలకు సారీ చెప్పి మరీ వెళ్లి పోయిందట. కొత్త వారితో నటించడం వల్ల ఉపయోగం ఉండదని, పారితోషికం కోసం చూసుకుంటే తనకున్న క్రేజ్ దెబ్బ తింటుందనే ఉద్దేశ్యంతో ఆమె నో చెప్పిందట. ఇంత పారితోషికంకు మరే హీరోయిన్ అయినా ఎగిరి గంతేసి మరీ ఓకే చెప్పేది. కాని నయన్ మాత్రం అలా కాదు.