బోయపాటికి హీరో దొరికినట్లేనా..?

వినయ విధేయ రామ చిత్రం ముందు వరకు బోయపాటి శ్రీను అంటే ఓ రేంజ్ లో ఊహించుకునే వారు..కానీ ఈ సినిమా తర్వాత ఆయన జతకమే మారిపోయింది. బోయపాటి తో సినిమా అంటే అభిమానులే వద్దు బాబోయ్ అనే స్థితికి వచ్చాడు. ప్రస్తుతం తెలుగులో ఏ హీరో కూడా సినిమా చేసేందుకు ముందుకు రాని పరిస్థితిలో శ్రీను తో సినిమా చేసేందుకు నేనున్నాను అంటూ జాగ్వార్ ముందుకు వచ్చినట్లు తెలుస్తుంది.

జాగ్వార్ చిత్రం తో ఇండస్ట్రీ కి పరిచమైన నిఖిల్ గౌడ..సినిమా పెద్దగా ఆడకపోయినా మీడియా లో హైలైట్ అయ్యాడు.ఇప్పుడీ నిఖిల్ గౌడనే బోయపాటితో చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాడట. ఒకవేళ ఈ వార్త నిజమైతే బోయపాటి శీను ఎంత బడ్జెట్ అడిగినా నిఖిల్ పెట్టొచ్చు. మల్టీ లాంగ్వేజ్ లో తీస్తారో లేక డబ్బింగ్ కొట్టి వదులుతారో..అసలు ఈ కాంబినేషన్ నిజామా కదా అనేది తెలియాల్సి ఉంది.