విజయ్ దేవరకొండ ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించేందుకు ఒప్పుకున్న చిత్రం ‘హీరో’. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడం మరియు మలయాళంలో కూడా ఈ చిత్రంను ప్లాన్ చేశారు. ఏకంగా అయిదు భాషల్లో అంటూ ముందు నుండే ప్రచారం చేస్తూ వచ్చారు. తాజాగా ఆ చిత్రం ఆగిపోయింది అంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. విజయ్ దేవరకొండ మార్కెట్ ఇంకా సెటిల్ అవ్వలేదని, భారీ బడ్జెట్ పెడితే ఆయన రాబట్టడం కష్టం అవుతుందేమో అనే అనుమానాలతో ఈ చిత్రంను క్యాన్సిల్ చేసినట్లుగా తెలుస్తోంది.
డియర్ కామ్రేడ్ చిత్రం సక్సెస్ అయితే ‘హీరో’ సినిమా కొన్నాళ్ల తర్వాత అయినా ప్రారంభం అయ్యేదేమో. కాని ఇప్పుడు ఆ అవకాశమే లేదు అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు. బైక్ రేసింగ్ నేపథ్యంలో సినిమా తెరకెక్కాల్సి ఉంది. ఢిల్లీ షెడ్యూల్‌కు ప్లాన్ చేశారు. అంతా సిద్దం చేసిన తర్వాత సినిమాను విజయ్ దేవరకొండ వద్దనుకున్నట్లుగా చెబుతున్నారు. హీరో క్యాన్సిల్ విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. డియర్ కామ్రేడ్ ఫలితంపై విజయ్ దేవరకొండ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి. ఆ తర్వాత హీరో సినిమా గురించి మాట్లాడతాడేమో.