ర్యాంప్ వాక్ లో రకుల్ కేక..

వరుస ప్రాజెక్ట్స్ తో బిజీ గా ఉన్న రకుల్ ప్రీతీ సింగ్..సోషల్ మీడియా లోను నిత్యం అభిమానులకు టచ్ లో ఉంటూ అలరిస్తుంటుంది. తన సినిమాలకు సంబందించిన విశేషాలతో పాటు పర్సనల్ విషయాలు , ఫొటోస్ షూట్స్ అప్డేట్స్ చేస్తూ ఆకట్టుకుంటుంది. తాజాగా హెయిర్ అండ్ బియాండ్ 2019 కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో తీసిన పిక్ ను పోస్ట్ చేసింది.

సదరు ఈవెంట్ గురించి చెప్తూ “మీరు దాన్ని #రెట్రో రీమిక్స్ కలెక్షన్ అనవచ్చు. కానీ నేను దాన్ని టైమ్ ట్రావెలింగ్ అంటాను. #హెయిర్ అండ్ బియాండ్ 2019 లో పాల్గోనడం.. అప్పటి తరానికి సంబంధించిన ఫ్యాషన్ ను మరోసారి గుర్తు చేసుకోవడం ఒక అద్భుతమైన అనుభవం. నాకు స్క్రంచ్డ్ పెకన్ కర్ల్స్ హెయిర్ స్టైల్ చేసినందుకు థ్యాంక్ యూ” అంటూ తన అనుభవాన్ని చెప్పుకొచ్చింది.

ఈ పిక్ లో రకుల్ … బ్రౌన్ కలర్ థై స్లిట్ గౌన్ లో ఒక ఇంటర్నేషనల్ మోడల్ తరహాలో ర్యాంప్ వాక్ కూడా చేసింది. స్లీవ్ లెస్.. డీప్ వీ నెక్ గౌన్ కావడంతో హాటు హాటర్ హాటెస్ట్ అనిపిస్తోంది.

ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో మన్మధుడు 2 చిత్రంలో నటిస్తుంది. కింగ్ నాగార్జున హీరోగా నటిస్తున్న ఈ మూవీ ఆగస్టు 09 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.