రెండు జడల సీత గా మారిన జిగేల్ రాణి..

వరుస సక్సెస్ లతో దూసుకెళ్తున్న జిగేల్ రాణి పూజా హగ్దే..ప్రస్తుతం ప్రభాస్ – రాధా కృష్ణ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఓ సినిమాలో..అలాగే అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కలయికలో రూపుదిద్దుకుంటున్న మూవీ లోను నటిస్తుంది. వీటితో పాటు గబ్బర్ సింగ్ ఫేమ్ హరీష్ శంకర్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న వాల్మీకి చిత్రంలోనూ నటిస్తుంది. రీసెంట్ గా ఈమె ఈ చిత్ర షూటింగ్ లో జాయిన్ అయ్యింది.

ఈమె తాలూకా ఫోటో ను హరీష్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. రెండు జాడలు వేసుకొని..లంగావోణీ డ్రెస్ లో పక్క పల్లెటూరు అమ్మాయిగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమాలోని ఓ మాస్‌ సాంగ్‌ను చిత్రీకరించారని తెలిసింది. ఈ పాటకు వరుణ్‌ వేసిన స్టెప్స్‌ అదుర్స్‌ అని సమాచారం. ఈ చిత్రం సెప్టెంబర్‌ 13న విడుదల కానుంది.