నార్త్‌లో పుష్కర కాలంగా కొనసాగుతున్న బిగ్‌బాస్ సౌత్‌లో ఇప్పుడిప్పుడే ప్రారంభం అయ్యింది. తెలుగు మరియు తమిళంలో రెండు సీజన్లు పూర్తి చేసుకుని మూడవ సీజన్లోకి అడుగు పెట్టింది. ఈ మూడవ సీజన్లు ఆరంభం కాకముందు నుండే గొడవలు ప్రారంభం అయ్యాయి. తెలుగు బిగ్‌బాస్ విషయంలో ఏ స్థాయిలో గొడవలు జరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక తమిళ బిగ్‌బాస్‌లో కూడా రచ్చ జరుగుతుంది. తెలుగు కంటే నెల రోజుల ముందు తమిళ బిగ్‌బాస్ ప్రారంభం అయ్యింది. తాజాగా తమిళ బిగ్‌బాస్ సెట్లోకి పోలీసులు ప్రవేశించారు.
తమిళ బిగ్‌బాస్ సీజన్ 3 కంటెస్టెంట్ అయిన మీరా మిథున్ గతంలో తన వద్ద 50 వేల రూపాయలను తీసుకుందని, ఆమె నా డబ్బులు ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతుందని, ఆ డబ్బుకు వడ్డీతో కలిపి ఇప్పుడు మూడు లక్షల వరకు అయ్యిందని పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. మిథున్ మీరా ఈ కేసు విషయంలో ఇప్పటికే ముందస్తు బెయిల్‌ను తీసుకోవడం జరిగింది. అయినా కూడా ఈ కేసు విచారణ నిమిత్తం పోలీసులు ఆమెను బిగ్‌బాస్ సెట్లో కలవడం జరిగింది. ఆమెను అరెస్ట్ చేస్తారనే వార్తలు వస్తున్నాయి. కాని అదేం లేదని పోలీసులు చెబుతున్నారు.