దిల్ రాజు తో బన్నీ విబేధాలు..?

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు – స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ మధ్య విభేదాలు రాసుకున్నాయా..ఇప్పుడు ఇదే టాలీవుడ్ లో చర్చ గా మారింది. ఆర్య , పరుగు , డీజే వంటి సినిమాలు దిల్ రాజు – బన్నీ కాంబినేషన్ లో వచ్చి కమర్షియల్ హిట్స్ సాధించాయి. తాజాగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో బన్నీ హీరోగా ఐకాన్ అనే చిత్రం చేయబోతున్నాడు దిల్ రాజు. త్వరలో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళబోతున్న తరుణంలో రెమ్యూనరేషన్ విషయంలో రాజు తో బన్నీ విభేదాలు చోటు చేసుకున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి.

తనకు పారితోషికం బదులుగా నాన్ థియేట్రికల్ రైట్స్ ఇమ్మని అల్లు అర్జున్ దిల్ రాజు ను అడిగాడట. దాంతో షాక్ తిన్న రాజు అటు మహేష్ బాబు ఇటు నువ్వు ఇలా హక్కుల రూపంలో పారితోషికం తీసుకుంటే ఇక తమకేమి మిగులుతుందని అన్నాడట. ఎంతో బడ్జెట్ పెట్టి మీము సినిమా చేస్తాం..నాన్ థియేట్రికల్ రైట్స్ మీద కొంత లాభం వస్తుంది..ఇప్పుడు దానిని కూడా మీరే అడిగితే మీము ఏం చేయాలి…ఒకవేళ సినిమా ప్లాప్ అయితే నష్టపోయేది మీమే..డిస్ట్రిబ్యూటర్ల నుంచి ఒత్తిడి మాకే..అని బన్నీ తో రాజు విభేదించాడని అంటున్నారు. మరి ఈ వార్తలు ఎంత వరకు నిజం అనేది తెలియాల్సి ఉంది.

ప్రస్తుతం బన్నీ త్రివిక్రమ్ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని గీత ఆర్ట్స్ , హారిక బ్యానర్ లు నిర్మిస్తున్నాయి.