దర్శకుల సంక్షేమం కోసం, కష్టాల్లో ఉన్న దర్శకులను ఆదుకోవడం, వారికి సాయం చేయడం కోసం దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ఒక ట్రస్ట్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. దర్శకుల సంఘం మే 4వ తేదీన రాఘవేంద్ర రావు టీఎఫ్‌డీటీ అంటూ ఈ ట్రస్ట్‌ను ప్రకటించడం జరిగింది. దాన్ని ఈనెల 24వ తారీకున రిజిస్ట్రర్ చేయించారు. మే 4వ తేదీన రాఘవేంద్ర రావు ప్రకటించిన వెంటనే చిరంజీవి పాతిక లక్షల విరాళంను ప్రకటించిన విషయం తెల్సిందే. ఇంకా పలువురు విరాళాలు ఇచ్చారు. తాజాగా జక్కన్న కూడా విరాళం ప్రకటించాడు.
రాఘవేంద్ర రావు 10 లక్షలు, ఆయన ఆధ్వర్యంలో సాగే ఆర్కే మీడియా నుండి 15 లక్షల విరాళంను ఇవ్వడం జరిగింది. ఇక తాజాగా రాజమౌళి తనవంతుగా రూ.50 లక్షలను విరాళంగా ప్రకటించాడు. ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో భారీ మూలదనంను పోగు చేసి వచ్చే వడ్డి డబ్బుతో కష్టాల్లో ఉన్న దర్శకులను ఆదుకునే ఉద్దేశ్యంతో రాఘవేంద్ర రావు ఈ ట్రస్ట్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే కోటిన్నర వరకు జమ అయినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ ట్రస్ట్‌కు చైర్మన్‌గా రాఘవేంద్ర రావు వ్యవహరించబోతున్నాడు. ఇంకా పలువురు ప్రముఖ దర్శకులు ఈ ట్రస్ట్ బాధ్యతలు చూడనున్నారు.