విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘డియర్ కామ్రేడ్’ చిత్రం మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సినిమా గురించి ప్రీ రిలీజ్ టాక్ అంటూ రకరకాలుగా ప్రచారం జరిగింది. కొన్ని బ్యాడ్ టాక్స్ వచ్చినా కూడా ఈ చిత్రానికి మాత్రం మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. పాతిక కోట్ల లోపు బడ్జెట్ ఈ చిత్రం తెరకెక్కి ఉంటుంది. అయినా కూడా కేవలం థియేట్రికల్ రైట్స్ ద్వారా ఏకంగా 33 కోట్ల వరకు రాబట్టింది. కేవలం తెలుగులోనే కాకుండా కన్నడం, మలయాళం మరియు తమిళంలో కూడా ఈ చిత్రం విడుదల కాబోతుంది. అక్కడ కూడా మంచి బిజినెస్ చేసింది.
ఏరియాల వారిగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ :
నైజాం : 9.1 కోట్లు
సీడెడ్ : 3.3 కోట్లు
వైజాగ్ : 2.4 కోట్లు
కృష్ణ : 1.65 కోట్లు
గుంటూరు : 1.75 కోట్లు
ఈస్ట్ : 1.5 కోట్లు
వెస్ట్ : 1.2 కోట్లు
నెల్లూరు : 85 లక్షలు
కర్ణాటక : 4 కోట్లు
తమిళనాడు : 2.50 కోట్లు
ఇతరం : 1.1 కోట్లు
ఓవర్సీస్ : 3.55 కోట్లు
మొత్తం : 32.85 కోట్లు