ఇంట్లో వాళ్లు విజయ్‌తో మళ్లీ సినిమా వద్దంటున్నారు

‘గీత గోవిందం’ చిత్రంతో సూపర్‌ హిట్‌ను దక్కించుకున్న విజయ్‌ దేవరకొండ మరియు రష్మికల జంట తాజాగా ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయిన విషయం తెల్సిందే. గీత గోవిందం చిత్రంతో పాటు డియర్‌ కామ్రేడ్‌ చిత్రంలో కూడా వీరిద్దరు ముద్దులు పెట్టుకున్నారు. వీరిద్దరి కెమిస్ట్రీ మరో స్థాయికి వెళ్లింది. వీరిద్దరు ప్రేమలో ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే ఆ వార్తలను ఇద్దరు కూడా కొట్టి పారేశారు. అయినా కూడా ఇద్దరు ఆఫ్‌ స్క్రీన్‌లో కూడా తెగ ఎంజాయ్‌ చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఏదో ఉందనే అనుకుంటున్నారు.

తాజాగా వైజాగ్‌లో మ్యూజిక్‌ ఫెస్టివల్‌లో రష్మిక పాల్గొంది. ఈ సందర్బంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ మళ్లీ విజయ్‌తో నటించవద్దని నా కుటుంబ సభ్యులు ఒత్తిడి చేస్తున్నారు. ఇప్పటికే జరిగింది చాలు మళ్లీ అతడితో నటిస్తే ఈ ప్రచారం ఎక్కువ అవుతుందని వారు భావిస్తున్నారు. ఇప్పటికైనా అతడి నుండి దూరంగా ఉండమని నాకు చెబుతున్నారు. మీడియాలో వస్తున్న వార్తలకు వారు భయపడుతున్నారు. నా గురించి పూర్తిగా తెలిసినా కూడా వారు మీడియాలో కథనాలను ఎక్కువగా పట్టించుకుంటున్నారు. మళ్లీ విజయ్‌ తో నటించక పోవచ్చు అంటూ రష్మిక చెప్పుకొచ్చింది. రష్మిక ప్రకటన ఈ జంట ఫ్యాన్స్‌కు నిరాశ మిగిల్చింది.