మూడు రోజుల క్రితం మండపేటలో కిడ్నాప్‌కు గురైన జషిత్ క్షేమంగా తిరిగి వచ్చాడు. 17 పోలీసు బృందాలు మరియు బంధువులతో పాటు సోషల్ మీడియాలో లక్షలదాది మంది జషిత్ కోసం వెదికారు. మూడు రోజులుగా తీవ్ర ఉత్కంఠను రేపిన జషిత్ క్షేమంగా తిరిగి వచ్చాడు. తనను ఇద్దరు వ్యక్తులు తీసుకు వెళ్లారని, వారు నాకు ఇడ్లీ తినిపించారంటూ చెప్పాడు. జషిత్ తిరిగి రావడంతో కుటుంబంలో ఆనందం వెళ్లివిరిచింది.
జషిత్ కుటుంబం మాత్రమే కాకుండా తెలుగు రాష్ట్రాల ప్రజలు అంతా కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నేడు ఉదయం ఒక వ్యక్తి బైక్ పై తీసుకు వచ్చి తనను వదిలి వెళ్లినట్లుగా చెప్పాడు. జషిత్‌ను స్థానిక కూళీలు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. జషిత్ వీడియోను షేర్ చేయడం జరిగింది. జషిత్ వీడియో నిమిషాల్లో లక్షల మందికి చేరింది. ఇక ఆ తర్వాత కొన్ని నిమిషాలకే జషిత్ వద్దకు కుటుంబ సభ్యులు చేరుకుని ఇంటికి తీసుకు వెళ్లారు.