రామ్ హీరోగా పూరి తెరకెక్కించిన ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంకు ఊహించని విధంగా మంచి కలెక్షన్స్ నమోదు అవుతున్నాయి. సినిమా విడుదలకు ముందు వరకు ఎవరు కూడా ఈ సినిమాను పెద్దగా పట్టించుకోలేదు. పూరి గత చిత్రాల మాదిరిగానే ఇది పోతుందని, లేదంటే కాస్త ఆడుతుందని భావించారు. కాని అనూహ్యంగా ఈ చిత్రం మొదటి నాలుగు రోజుల్లోనే ఏకంగా 50 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఇక ఈ చిత్రం సోమవారం నుండి కనిపించదని భావించారు. కాని వీక్ డేస్‌లో కూడా సినిమా కుమ్మేస్తూనే ఉంది.
సోమ మరియు మంగళ వారాల్లో ఈ చిత్రం మంచి షేర్‌ను రాబట్టినట్లుగా చిత్ర యూనిట్ సభ్యుల ద్వారా సమాచారం అందుతోంది. ఈ చిత్రం డియర్ కామ్రేడ్ వచ్చే వరకు ఇలాంటి వసూళ్లనే రాబట్టడం ఖాయంగా కనిపిస్తుంది. డియర్ కామ్రేడ్ లేకపోతే ఇస్మార్ట్ శంకర్ మరో శని, ఆదివారాల్లో కూడా మంచి షేర్‌ను దక్కించుకుఏది. కాని పరిస్థితి చూస్తుంటే సినిమా డియర్ కామ్రేడ్ రాగానే కనిపించకుండా పోయే అవకాశం ఉంది. ఇస్మార్ట్ శంకర్‌కు మంచి సక్సెస్ టాక్ వచ్చినా కూడా డియర్ కామ్రేడ్‌కు ఉన్న క్రేజ్ ముందు నిలవడం కష్టంగానే అనిపిస్తుంది. డియర్ కామ్రేడ్ ఫలితం తారుమారు అయితే తప్ప శంకర్ ఆ తర్వాత నిలదొక్కుకోవడం కష్టం. డియర్ కామ్రేడ్ మరో మూడు రోజుల్లో అంటే ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.