కులభూషణ్ మరణశిక్ష పై కోర్టు స్టే…!

పాకిస్తాన్ చెర‌లో బంధీగా ఉన్న కుల్‌భూష‌ణ్ జాద‌వ్‌కు అంత‌ర్జాతీయ కోర్టులో ఊర‌ట ల‌భించింది. పాక్ మిల‌ట‌రీ కోర్టు విధించిన మ‌ర‌ణశిక్ష తీర్పుపై ఐసీజే స్టే విధించింది. కాగా 2016లో గూఢ‌చ‌ర్య ఆరోప‌ణ‌ల‌పై భార‌త నౌకాద‌ళ విశ్రాంత అధికారి కుల్‌భూష‌ణ్ జాద‌వ్ ను పాక్ బంధించింది. 2017 ఏప్రిల్‌లో పాక్ సైనిక కోర్టు మ‌ర‌ణ‌శిక్ష విధించింది.అయితే దీనిపై అంత‌ర్జాతీయ కోర్టును భార‌త్ ఆశ్ర‌యించింది.

 

2016లో కుల్‌భూషణ్ జాదవ్‌ను బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో పాకిస్తాన్ బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. అక్కడి మిలిటరీ కోర్టు.. 2017లో అతడికి మరణ శిక్ష విధించింది. అయితే, పాక్ చర్యను తీవ్రంగా తప్పుబట్టిన భారత్ అంతర్జాతీయ న్యాయస్థానంలో సవాల్ చేసింది. అమాయకుడైన కులభూషణ్ జాదవ్‌‌ను దోషిగా చిత్రీకరించేందుకు పాక్ ప్రయత్నిస్తోందని ఆరోపించింది. దీనికి సంబంధించి ఈ ఏడాది ఫిబ్రవరి 18 నుంచి 21 వరకూ సాగిన తుది విచారణలో భారత్‌, పాకిస్తాన్‌లు తమ వాదనలను న్యాయస్ధానానికి నివేదించాయి. దీంతి ఐసీజే పాక్ కోర్టు విధించిన తీర్పును నిలిపివేసింది.