జగన్ బడ్జెట్ పై లోకేశ్ జంపింగ్ జపాంగ్ పంచ్…!

వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నారా లోకేశ్ ట్విట్ల యుద్దం కొనసాగిస్తున్నాడు. జగన్ సర్కార్ లూప్ హోల్స్ పై ట్వీట్ల పరంపర కొనసాగిస్తున్న లోకేశ్ తాజాగా జగన్ సర్కార్ బడ్జెట్ పై ట్వీట్ చేశాడు. అమ్మ ఒడి పథకంలో లబ్ది పొందే తల్లుల సంఖ్యను సగానికి సగం తగ్గించడం సరికాదని విమర్శించారు. “ఒక తల్లికి ఇవ్వడమేంటి? మరో తల్లికి ఇవ్వకపోవడం ఏంటి? ఆ విధంగా స్కిప్ చేసుకుంటూ పోయి జంపింగ్ జపాంగ్ ఆటలాడతారా? ఎలాగూ పథకాలకు మీ పేర్లు పెట్టుకుని మురిసిపోతున్నారు కదా! ఈ పథకానికి ‘జగనన్న జంపింగ్ జపాంగ్’ అని పేరు పెట్టుకుంటే సరిపోయేది అంటూ సెటైర్ వేశారు.

అంతేగాకుండా, గృహనిర్మాణాలకు కేవలం రూ.8,165 కోట్లు ఇచ్చారంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. జగన్ గారూ, బడ్జెట్ లో గృహనిర్మాణాలకు కేటాయించిన నిధులు చూస్తుంటే మీరు నిర్మిస్తామన్నది పిచ్చుక గూళ్లేమోనని సందేహం వస్తోందంటూ లోకేశ్ మరో ట్వీట్ చేశారు.