ఏపీ బడ్జెట్ పై యనమల వ్యంగ్యాస్త్రాలు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై మాజీ ఆర్థిక శాఖా మంత్రి యనమల రామకృష్ణుడు… వ్యంగ్యాస్త్రాలు విడిచారు. ప్రభుత్వం రూ.48వేల కోట్లు అప్పు చేసేందుకు సిద్ధమైందని ఆయన ఆరోపించారు. అప్పులపై అప్పట్లో నీతులు చెప్పిన జగన్.. ఇప్పుడు అప్పులనే నమ్ముకున్నారని వ్యంగ్యా బాణాలను విడిచారు.

అదవిధంగా సున్నా వడ్డీ పథకంపై గొప్పలు చెప్పిన వైసీపీ సర్కార్… ఆ పథకానికి రూ.100 కోట్లు మాత్రమే కేటాయించిందని వివరించారు. సోషల్ వెల్ఫేర్‌కు నిధుల కోత పెట్టారని.. ఇరిగేషన్‌కు వెయ్యి కోట్ల రూపాయలు తగ్గించారని వివరించారు. స్కీమ్‌లకు వైఎస్ఆర్, వైఎస్ జగన్ పేర్లు తప్ప.. వేరే పేర్లు లేవా? అంటూ యనమల మండిపడ్డారు. కాగా ‘నేను విన్నాను.. నేనున్నాను.. కాదు.. నేను తిన్నాను అంటే కూడా బాగుండేది’ అంటూ యనమల బుగ్గన బడ్జెట్ పై తీవ్ర బాణాలు వదిలారు.