సంపాదనలో అక్షయ్ కుమార్ టాప్

బాలీవుడ్ టాప్ హీరోల్లో అక్షయ్ కుమార్ ఒకరు. బాలీవుడ్ లో ఏడాదికి కనీసం ఎట్ట లేదన్నా నాలుగు నుంచి ఐదు సినిమాలు చేస్తూ అలా దూసుకుపోతున్నాడు అక్షయ్. ప్రతి సినిమాకు సుమారు రూ. 35కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకంటాడు. దీంతో పాటు సినిమాపై వచ్చిన లాభాల్లో కూడా వాటా ఉంటుంది.

అదేవిధంగా అక్షయ్ తో సినిమా అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. అయినా కానీ.. మంచి లాభాలు వస్తాయని.. అక్షయ్ తో సినిమాలు చేసేందుకు మెగ్గు చూపుతుంటారు దర్శక నిర్మాతలు.

అంతేకాకుండా వీటికో పాటు అక్షయ్ దాదాపు 20 ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు. కాగా మొత్తమ్మీద సంవత్సరానికి అక్షయ్ కుమార్ దాదాపుగా రూ. 444 కోట్ల రూపాయల ఆదాయం ఆర్జిస్తున్నట్టు సెలెబ్రిటీస్ మ్యాగజైన్ తెలిపింది. ఇండియా నుంచి టాప్ లిస్ట్ లో ఉన్న సెలెబ్రిటీ నటుడు అక్షయ్ కుమార్ ఒక్కరే కావడం విశేషం. ఈ జాబితాలో వరల్డ్ లో టేలర్ స్విఫ్ట్ టాప్ పొజిషన్ లో ఉండగా.. అక్షయ్ 35వ స్థానాన్ని చేజిక్కించుకున్నాడు.