సినిమాల కంటే వెబ్ సిరీస్ బెటర్ అంటున్న నిహారిక?

కొణిదెల నిహారిక నటన వైపు వచ్చి చాల కాలమే అయింది. ఒక వైపు వెబ్ సిరీస్ లు,మరో వైపు సినిమాలు,ఎంటర్ టైన్ మెంట్ షోల తో బాగా పాపులర్ అయింది. వీటన్నిటిలో మెగా డాటర్ నిహారికకి పేరు తెచ్చింది మాత్రం వెబ్ సిరీస్ లే. తనకు నచ్చిన కథలంటూ ఒకటి రెండు సినిమాలు చేసినా అవి కమర్షియల్ గా సక్సెస్ సాధించలేదు. ‘ఒక మనసు’ .. ‘హ్యాపీ వెడ్డింగ్’ .. ‘సూర్యకాంతం’ వంటి సినిమాలు చేసినా అవి అంతగా ఆకట్టుకోలేకపోయ్యాయి.

దీంతో ఇక పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పే ఆలోచన చేస్తుంది నిహారిక. ఈ విషయాన్ని తండ్రితోను చెప్పేసిందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ఇకపై సినిమాల జోలికి వెళ్లకుండా వెబ్ సిరీస్ ల పైనే పూర్తి దృష్టిపెట్టనున్నట్టుగా తెలుస్తోంది. వెబ్ సిరీస్ ల వల్లనే తనకి మంచి పేరు రావడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నారు.