తెలంగాణా సర్కార్ కి హైకోర్టు షాక్

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సచివాలయం, ఎర్రమంజిల్‌ భవనాలు కూల్చొద్దని కోర్టు ఆదేశించింది. ఎవరు అన్ని చెప్పినా తాము అనుకున్నది చేసి తీరతామని చెబుతున్న ప్రభుత్వ ఒంటెత్తు పోకడకి ఇది చెంప పెట్టుగానే చెప్పాలి. విషయం కోర్టులో ఉన్న నేపధ్యంలో తమ ఉత్తర్వులు వచ్చే వరకూ వాటిని కూల్చడానికి వీల్లేదని ఆదేశించింది. సచివాలయ భవనం, ఎర్రమంజిల్ కోర్టు కూల్చివేతలపై పాడి మల్లయ్య అనే సామాజిక కార్యకర్త హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

అయితే ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయడానికి ప్రభుత్వ తరపు న్యాయవాది మరో 15 రోజు ల సమయం కావాలని కోర్టును కోరగా, అయితే దీనిపై ఇవాళే వాదనలు కొనసాగాలని హైకోర్టు ఆదేశించింది. కేసు విచారణను మధ్యాహ్నం 2.15కు వాయిదా వేసింది. నిజానికి ఈ ప్రతిపాదనను టీఆర్ఎస్ తప్ప మిగతా ఎవరూ స్వాగతించాడం లేదు. అయినా ఎందుకు ప్రభుత్వం మొండిగా ప్రవర్తిస్తుందో అర్ధం కావడం లేదు.