బడ్జెట్ లో ధరలు పెరిగే వస్తువులు,తగ్గే వస్తువులు ఇవే…!

సాధరణంగా బడ్జెట్ అనగానే ఏ వస్తువుల ధరలు పెరుగుతాయి…ఏ వస్తువుల ధరలు తగ్గుతాయన్నది సామన్యుల నుంచి సంపన్నుల వరకు ఎదురుచూస్తారు. ఈరోజు ప్రకటించిన బడ్జెట్ లో కూడా కొన్ని వస్తువుల రేట్లు పెరుగుతుండగా మరి కొన్ని వస్తువుల రేట్లు దిగి రానున్నాయి…ఇక ఈ బడ్జెట్ లో ఎలక్ట్రిక్‌ వాహనాలపై రాయితీలు ఇవ్వనున్నట్లు తెలిపారు. బంగారంపై కస్టమ్స్‌ సుంకాన్ని 10శాతం నుంచి 12.50శాతానికి పెంచుతున్నట్లు తెలిపారు. తాజా బడ్జెట్‌ వివిధ వస్తువుల ధరలపై ప్రభావ చూపనుంది.

ఇవి పెరుగుతున్నాయి…

* బంగారం
* పెట్రోల్‌ డీజిల్‌
* ఏసీలు
* స్టోన్‌ క్రషింగ్‌ ప్లాంట్‌లు
* సీసీ కెమెరాలు
* స్పీకర్లు
* డిజిటల్‌ వీడియో రికార్డర్లు
* ఆటో మొబైల్‌లో వినియోగించే
షీట్లు, రోల్స్‌, డిస్క్‌లు, ప్యాడ్‌లు
* కార్ల అద్దాలు, రేర్‌ వ్యూ గ్లాస్‌
* మోటార్‌ బైక్‌లకు వేసే తాళాలు
* ఆయిల్‌/ఎయిర్‌ ఫిల్టర్‌లు
* బైక్‌ హార్న్‌లు
* లైటింగ్‌ సిస్టమ్‌
* కార్ల విండో స్క్రీన్‌ వైపర్‌

* సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులపై విపత్తు నిధి పన్ను
* జీడి పిక్కలు
* సబ్బులు
* ప్లాస్టిక్‌ ఫ్లోర్‌ కవర్లు
* రబ్బరు
* టైర్లు
* న్యూస్‌ ప్రింట్‌
* మ్యాగజైన్లు
* దిగుమతి చేసుకునే పుస్తకాలు
* ఆప్టికల్ ఫైబర్‌ కేబుళ్లు
* సిరామిక్‌ టైల్స్‌
* స్టెయిన్‌లెస్‌ స్టీల్‌
* అలాయ్‌ స్టీల్‌ వైర్‌
* మెటల్‌ ఫర్నిచర్‌
* పీవీసీ పైపులు

ఇవి తగ్గుతాయి…

* గృహ రుణాలు
* రక్షణ సామగ్రి
* నాఫ్తా
* సెల్‌ఫోన్‌ ఛార్జర్లు
* సెట్‌టాప్‌ బాక్సులు
* మొబైల్‌ ఫోన్లలో వినియోగించే లిథియం బ్యాటరీలు
* ఎలక్ట్రిక్‌ కారులు, బైక్‌లు, ఛార్జింగ్‌ సైకిళ్లు