ప్రభాస్ నటిస్తున్న సాహో నుండి ఫస్ట్ సింగిల్ టీజర్ వచ్చేసింది..గత కొన్ని రోజులుగా చిత్ర టీజర్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ టీజర్ పండగ వాతావరణం తీసుకరావడం ఖాయంగా కనిపిస్తుంది. అల్ట్రా ఎలెక్ట్రిక్ మ్యూజిక్ తో టీజర్ కేక పుట్టించింది. కేవలం 28 సెకన్ల నిడివిలోనే కేక పుట్టిస్తే..ఫుల్ సాంగ్ ఇంకెలా ఉండబోతుందో చూడాలి. జులై 8 న ఈ ఫస్ట్ సింగిల్ ఫుల్ లిరికల్ సాంగ్ ను విడుదల చేస్తున్నట్లు టీజర్ లో చిత్ర యూనిట్ తెలిపారు.
సుజిత్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శ్రద్ద కపూర్ నటిస్తుండగా.. నీల్ నితిన్ ముఖేశ్ ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నారు. ఎవ్లిన్ శర్మ, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్, మందిరా బేడీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జిబ్రాన్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. దాదాపు 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలవుతుంది. యు.వి.క్రియేషన్స్ బ్యానర్‌పై సినిమా నిర్మితమవుతుంది.