ఉపాసన చేతిలో ఉన్న బాబు ఎవరో తెలుసా..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన సోషల్ మీడియా లో ఫుల్ యాక్టివ్ గా ఉంటుందనే సంగతి తెలిసిందే. చరణ్ కు సంబందించిన విశేషాలతో పాటు పలు విషయాల గురించి ఎప్పుడు ప్రస్తావిస్తూ ఉంటుంది. తాజాగా ఓ బాబు ను ఎత్తుకొని సందడి చేసింది. ఇంతకీ ఆ బాబు ఎవరో తెలుసా ..టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కొడుకు ఇజాన్‌ తో.

ప్రస్తుతం లండన్ లో ప్రపంచ కప్ క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ జట్టు కూడా ఆడుతుండడం తో సానియా..తన భర్త షోయబ్ మాలిక్ కూడా ఉన్నాడు. అందుకే ఆమె మ్యాచ్‌లను తిలకించేందుకు గత కొద్ది రోజులుగా ఇంగ్లండ్‌లోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఉపాసన కూడా వీరితో కలిసింది.

సానియా మీర్జాకు, ఉపాసనకు మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. గతంలో రామ్ చరణ్, ఉపాసన కలిసి హైదరాబాద్‌లోని సానియా మీర్జా టెన్నిస్ అకాడమీని సందర్శించారు. అలాగే, న్యూ ఇయర్ రోజున సానియా, ఉసాసన, చెర్రీ మంచుతో ఆటలాడారు. ఇప్పుడు, సానియా కొడుకు‌ ఇజ్జుతోనూ ఉపాసన ఆటలాడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోస్ సోషల్ మీడియా లో హల్చల్ చేస్తున్నాయి.