నాగ్ బిగ్ బాస్ 3 ప్రోమో లీక్..

తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 వచ్చే నెలలో ప్రసారం కాబోతుంది. గత రెండు సీజన్లు సక్సెస్ కావడం తో మూడో సీజన్ కోసం యావత్ తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. మొదటి రెండు సీజన్లకు ఎన్టీఆర్ , నాని లు హోస్ట్ లుగా వ్యవహరించగా..మూడో సీజన్ కు నాగార్జున చేస్తున్నాడు. ఇక ఈ వార్త ఖరారైనప్పటి నుండి ప్రోమోస్ కోసం అభిమానులు ఆసక్తి పెంచుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో ఓ చిన్నపాటి ప్రోమో లీక్ అయ్యింది. అందులో నాగార్జున సెట్ లో స్టైల్ గా నడుచుకుంటూ వస్తుండగా చుట్టూ ఉన్న సెట్ వాతావరణం అది బిగ్ బాస్ అని చెప్పకనే చెప్పింది. ఇక తెలియాల్సింది పార్టిసిపెంట్స్ గా ఎవరు వస్తారు అనేదే.