హ్రస్వరూపం

కమలహసను కన్నీటికి
జవాబేది జయమ్మా !
పాలిటిక్సు పరాకాష్ట
ఇది ఎక్కడి దయమ్మా !!

ఆస్తులమ్మి అప్పుచేసి
ఓ సినిమా నిర్మిస్తే !
సబబేనా సర్కారుకు
దాన్ని ఇలా చంపేస్తే !!

సర్టిఫికెటు ఇచ్చారుగ
భేషుగ్గా సెన్సారోళ్ళు !
మంచిది కాదోయ్ జాతికి
నటుడికంట కన్నీళ్ళు !!

వివాదమే లేనప్పుడు
ఎందుకంట నిషేధం !
తమిళనాట అధినేత్రికి
వినోదాల విరోధం !!

– ఏవీయస్