‘ చాణక్య ‘ లో సునీల్ రోల్ కేక పుట్టిస్తుందట..

హీరోగా వరుస ప్లాపులు అందుకున్న సునీల్ ..రీసెంట్ గా మళ్లీ తన పాత పద్దతిలోకి వెళ్ళిపోయాడు. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ లలో నటిస్తూ వరుస హిట్లు అందుకుంటున్నాడు. రీసెంట్ గా అరవింద సమేత, చిత్రలహరి చిత్రాలతో హిట్ అందుకున్న సునీల్ ..ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నాడు. అందులో గోపీచంద్ హీరోగా తిరు డైరెక్షన్లో తెరకెక్కుతున్న చాణక్య సినిమాలో కీ రోల్ చేస్తున్నాడు.

ఇది కూడా ఫుల్ లెంగ్త్ పాత్రని తెలుస్తోంది. సునీల్ గతంలో గోపీచంద్ చేసిన ‘ఆంధ్రుడు, ఒంటరి’ సినిమాలో మంచి ఎంటర్టైనింగ్ రోల్స్ చేసి మెప్పించిన సంగతి తెలిసిందే. మరి ఈ సినిమాలో సునీల్ రోల్ కేక పుట్టిస్తుందని అంటున్నారు. మరి ఆ రోల్ ఎలా ఉంటుందో చూడాలి. అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాలో మెహ్రీన్ , జరీన్ ఖాన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.