తండ్రి పాత్రలో క్రేజీ హీరో..

వైవిధ్య భరిత చిత్రాల్లో విభిన్న పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న హీరో విజయ్ సేతుపతి. ప్రస్తుతం ఈయన మెగాస్టార్ చిరంజీవి – సురేందర్ రెడ్డి – చరణ్ కలయికలో తెరకెక్కుతున్న సైరా నరసింహ రెడ్డి చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. అలాగే మరో మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న “ఉప్పెన” చిత్రంలో విజయ్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ మూవీ లో విజయ్ ఏ రోల్ లో నటిస్తున్నాడా అని మొన్నటి వరకు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ వచ్చారు. ఇక వారి ఎదురుచూపులు తెరపడింది. ఈ మూవీ లో విజయ్ సేతుపతి హీరోయిన్ గా చేస్తున్న కృతి శెట్టికి తండ్రిగా కనిపించనున్నారని సమాచారం. ఆ పాత్రకు ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉండటంతో పాటు కథలో కీలకం కావడంతో విజయ్ ఆ పాత్ర చేయడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తుండగా,దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు.మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.