‘కల్కి’ రిలీజ్ డేట్ ఫిక్స్..

యాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్ హీరోగా ‘అ!’ ఫేమ్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘కల్కి’. గరుడవేగా తర్వాత రాజశేఖర్ నుండి వస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ కావడంతో ఈ సినిమా ఫై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. ఇక ఈ సినిమా మే నెలలోనే ప్రేక్షకుల ముందుకు వస్తుందని అంత భావించారు కానీ థియేటర్స్ లోకి రాకపోవడం..కొన్ని సన్నివేశాలు రీ షూట్ చేస్తున్నారనే వార్తలు ప్రచారం కావడం తో ఈ సినిమా ఇప్పట్లో వస్తుందో రాదో అని అంత మాట్లాడుకున్నారు. కానీ వారి మాటలకూ చెక్ పెట్టారు చిత్ర యూనిట్ .

తాజాగా సినిమా రిలీజ్ డేట్ తో కూడిన సరికొత్త పోస్టర్ ను రిలీజ్ చేసి పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టారు. షూటింగ్ పూర్తై పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ చిత్రాన్ని జూన్ 28న ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే విడుదలైన చిత్ర ట్రైలర్ బాగా ఆకట్టుకోవడంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి బాగా పెరిగింది. ఆదా శర్మ, పూజిత పొన్నాడ, నందిత శ్వేత, స్కార్లెట్ మెల్లిష్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను సి.కళ్యాణ్ నిర్మించారు. ఇందులో రాజశేఖర్ ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. మరి గరుడవేగా తో హిట్ అందుకున్న రాజశేఖర్ కు ఈ కల్కి ఎలాంటి హిట్ ఇస్తుందో చూడాలి.