ఎమ్మెల్యే రోజా కు ఆ పదవి ఇవ్వబోతున్నారా..?

నగరి నుండి రెండు సార్లు ఎమ్మెల్యే గా పోటీ చేసి గెలుపొందిన రోజా కు మంత్రి పదవి ఇవ్వకపోవడం ఫై జగన్ ఫై కాస్త ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రోజా అభిమానులు. పార్టీ కి వెన్నుగా ఉండి..తెలుగుదేశం ఫై ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తూ వైసీపీ కి కావాల్సిన పబ్లిసిటీ ఇచ్చిన రోజా ను పక్కకు పెట్టడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. ఐతే… స్పీకర్ పదవి వద్దన్న ఆమెకు… సామాజిక సమీకరణాల రీత్యా మంత్రి పదవి ఇవ్వలేకపోయారే తప్ప… సీఎం జగన్ ఆమెను పక్కన పెట్టలేదని జగన్ సన్నిహితులు చెపుతున్నారు. మొన్నటి వరకు తనకు మంత్రి పదవి ఇస్తారని కొండంత ఆశగా ఎదురుచూసిన రోజా కు చివరికి మంత్రి పదవి ఇవ్వకపోవడం కాస్త నిరాశ చెందింది. అందుకే మంత్రుల ప్రమాణ స్వీకారానికి రాకుండా అలకపాన్పు ఎక్కింది.

ఈ నేపథ్యంలో రోజాను బుజ్జగించి పనిలో పార్టీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ఉన్నట్లు తెలుస్తుంది. తాజాగా ఆమెకు ఆర్టీసీ అధ్యక్షురాలి పదవి ఇవ్వబోతున్నట్లు చెప్పారనీ… దాంతో రోజా కూల్ అయ్యిందని తెలుస్తుంది. ఒకవేళ ఆర్టీసీ ఛైర్ పర్సన్ పదవి ఇవ్వకపోతే మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ పదవైనా తనకు ఇవ్వాలని రోజా కోరినట్లు వినికిడి. 2009లో టీడీపీ అభ్యర్థిగా చంద్రగిరి నుంచీ పోటీ చేసి ఓడిన రోజా… ఆ తర్వాత వైఎస్ హయాంలో కాంగ్రెస్‌లో చేరారు. రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత… జగన్‌ వెంట ఉన్నారు. ఆ క్రమంలో చిత్తూరు జిల్లా నగరి నుంచీ వరుసగా రెండుసార్లు గెలిచారు.