గల్లా కు డైరెక్టర్ దొరికాడట..

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ నుండి మరో హీరో రాబోతున్న సంగతి తెలిసిందే. మహేష్ మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా ఇండస్ట్రీ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. వాస్తవానికి కొన్ని రోజుల క్రితం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ఫై ప్రముఖ నిర్మాత దిల్ రాజు అశోక్ ను లాంచ్ చేసాడు. కానీ ఏమైందో ఏమో కానీ ఈ సినిమాను మధ్యలోనే ఆపేసారు.

ఇక ఇప్పుడు మరోసారి అశోక్ హీరోగా ఓ సినిమా ఫిక్స్ అయ్యిందట. దిల్ రాజు నిర్మాణంలో శ్రీరామ్ ఆదిత్య అశోక్ గల్లాను హీరోగా లాంచ్ చేయనున్నట్లు తెలుస్తుంది. ‘భలే మంచి రోజు, దేవదాస్, శమంతకమణి’ వంటి సినిమాల్ని డైరెక్ట్ చేసిన శ్రీరామ్ ..ఇప్పుడు అశోక్ ను డైరెక్ట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. అతి త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి రానుందట. మరి ఈ సినిమా కాస్ట్ & క్రూ ఏంటి అనేది తెలియాల్సి ఉంది.