నితిన్ కోసం పీసీ…

నితిన్ కెరియర్ మరోసారి డైలమో లో పడింది. వరుస ప్లాపుల తర్వాత ఇష్క్ ఊపిరి పిస్తే..ఆ తర్వాత అ..ఆ , గుండె జారీ గల్లంతయ్యిందే ఇలా వరుస హిట్లు పడేసరికి నితిన్ కు డోకా లేదని అంత అనుకున్నారు. కానీ ఆ తర్వాత వరుస ప్లాప్స్ తో మళ్లీ డౌన్ అయ్యాడు. ప్రస్తుతం తొలిప్రేమ ఫేమ్ వెంకీ డైరెక్షన్లో భీష్మ సినిమా చేయబోతున్నాడు. ఈనెల 20న ఈ సినిమా ప్రారంభం అవుతోంది.

ఇక ఈ సినిమాకోసం ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పిసి శ్రీరామ్ పనిచేస్తున్నారు. గతంలో నితిన్ తో ఇష్క్ సినిమా చేసాడు. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో..ఆ సినిమాకు సినిమా ఫొటోగ్రఫీ ఎంత హైలైట్ అయ్యిందో తెలియంది కాదు. అలాగే ఈ సినిమాకోసం ఇద్దరు క్రేజీ హీరోయిన్లు రష్మిక, కీర్తిసురేష్ సెట్ చేసారు. మొత్తం మీద ఈ సినిమాకోసం సితార ఎంటెర్టైన్మెంట్స్ వారు భారీగానే ఖర్చు చేస్తున్నారు. మరి వెంకీ ఏం చేస్తాడో చూడాలి.