సాహో కథ లీక్…అభిమానులు పండగ చేసుకోవచ్చు..

ప్రభాస్- శ్రద్ద కపూర్ జంటగా సుజిత్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న చిత్రం సాహో. తెలుగు , తమిళ్ , హింది భాషల్లో ఆగస్టు 15 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ మూవీ ఫై ఎలాంటి అంచనాలు నెలకొని ఉన్నాయో చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటి వరకు సినిమా కు సంబందించిన అనేక విషయాలు బయటకు వచ్చాయి కానీ ప్రభాస్ రోల్ ఏంటి..? సాహో టైటిల్ కు ప్రభాస్ కు సంబంధం ఏంటి అనేది ఇప్పటివరకు తెలియకపోవడం తో అభిమానులంతా దాని గురించి ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఫిలిం సర్కిల్లో ప్రభాస్ రోల్ ఏంటి అనేది బయటకు లీక్ అయ్యింది.

సాహో చిత్రం రివెంజ్ డ్రామాగా తెరకెక్కుతుందట. ఓ అండర్ వరల్డ్ డాన్ ను అంతం చేయడానికి ప్రభాస్ నకిలీ ఇంటర్ పోల్ ఆఫీసర్ గా మారతాడు..ఆలా అండర్ వరల్డ్ డాన్ అనుచరులను చంపేస్తాడు. ఫ్లాష్ బ్యాక్ లో ఆ డాన్ ప్రభాస్ కుటుంబ సభ్యులను , స్నేహితులను హత్య చేస్తాడు. దీంతో ఆ డాన్ ను అంతం చేయడానికే ప్రభాస్ నకిలీ ఇంటర్ పోల్ ఆఫీసర్ గా మారతాడు..ఈ ఆసక్తి రివెంజ్ కథ తోనే సాహో తెరకెక్కిందని అంటున్నారు. మరి ఇది ఎంత వరకు నిజం అనేది తెలియాలి. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఓ పాట మినహా షూటింగ్ అంత పూర్తి చేసుకుంది.